Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వరంగల్ ఎంజీఎంలో డాక్టర్ ఆత్మహత్యాయత్నం

pg doctor suicide attempt in warangal MGM Hospital
Advertisement
  • హానికరమైన ఇంజక్షన్ తీసుకున్న పీజీ వైద్యురాలు
  • గమనించి చికిత్స అందిస్తున్న తోటి వైద్యులు
  • ధ్రువీకరించిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్ దాస్
Advertisement
వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో పీజీ వైద్యురాలు ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా చదువుతున్న డాక్టర్ ధరావత్ ప్రీతి బుధవారం తెల్లవారుజామున సూసైడ్ అటెంప్ట్ చేశారు. విధుల్లో ఉన్నప్పుడే హానికరమైన ఇంజక్షన్ ను తీసుకున్నారు. తోటి వైద్యులు ఇది గమనించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 

డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నం విషయాన్ని కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ ధ్రువీకరించారు. ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి గల కారణాలు ఏమిటి అనేది తెలియదని చెప్పారు. రెండు రోజుల క్రితం డాక్టర్ ప్రీతిని ఓ సీనియర్ డాక్టర్ వేధించినట్లు సమాచారం. ఈ ఘటనపై డాక్టర్ ప్రీతి ఫిర్యాదు మేరకు సదరు సీనియర్ డాక్టర్ ను మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్ దాస్ మందలించినట్లు తెలిసింది. అయినప్పటికీ బుధవారం డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించారు.
Advertisement
Advertisement
warangal
mgm hospital
pg doctor
suicide attempt
injection
kakatiya medical college

More Telugu News